Breaking News

మద్యం తాగి వాహనాలు నడిపేవారికి హెచ్చరిక

2025 డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపేవారిని ఉద్దేశించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.


Published on: 31 Dec 2025 14:53  IST

2025 డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపేవారిని ఉద్దేశించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.

మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన వారికి  భారీ జరిమానా , 6 నెలల వరకు జైలు, వాహనాన్ని  సీజ్ చేస్తారు.డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని రవాణా శాఖకు సిఫార్సు చేస్తారు.

హైదరాబాద్ వ్యాప్తంగా 120 వ్యూహాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి, 7 ప్లాటూన్ల అదనపు బలగాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.రాజకీయ లేదా వ్యక్తిగత పలుకుబడి ఉపయోగించి తనిఖీల నుంచి తప్పించుకోవాలని చూస్తే సహించేది లేదని, అటువంటి వారిని నేరుగా కోర్టులోనే కలుస్తామని సజ్జనార్ హెచ్చరించారు.మద్యం సేవించిన వారు తామే వాహనం నడపకుండా, క్యాబ్‌లు లేదా ఇతర డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. "మియా.. డ్రింక్ చేశావా? అయితే స్టీరింగ్‌కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు" పబ్‌లు ,హోటళ్లలో వేడుకలు 1 గంటకే ముగించాలి అని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి