Breaking News

విద్యుదాఘాతంతో  అత్తారింట్లో అల్లుడు మృతి

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో విద్యుదాఘాతంతో  అత్తారింట్లో అల్లుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మే 25, 2026, సోమవారం నాడు చోటుచేసుకుంది.

Published on: 25 May 2026 16:19  IST

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో విద్యుదాఘాతంతో  అత్తారింట్లో అల్లుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మే 25, 2026, సోమవారం నాడు చోటుచేసుకుంది.

మరణించిన వ్యక్తి పేరు ఆంజనేయులు. ఇతను అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామానికి చెందినవాడు మూలమల్ల గ్రామంలోని తన అత్తారింటికి ఒక శుభకార్యం నిమిత్తం ఆంజనేయులు వచ్చాడు. ఆ సమయంలో వాటర్ మోటర్ ఆన్ చేసి ఇల్లు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి (కరెంట్ షాక్‌) గురయ్యాడు.

తీవ్రమైన విద్యుత్ షాక్ తగలడంతో ఆంజనేయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మృతుడికి భార్య ప్రావిని, ఒక కుమారుడు ఉన్నారు. శుభకార్యం కోసం వచ్చిన అల్లుడు కళ్లముందే కరెంట్ షాక్‌తో మరణించడంతో అత్తారింట్లోనూ, అతని సొంత గ్రామంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి