Breaking News

పాబ్లో పికాసో గీసిన ₹9.3 కోట్ల విలువైన పెయింటింగ్‌ను, పారిస్‌కు చెందిన ఒక వ్యక్తి కేవలం ₹11 వేల  లాటరీ టికెట్‌తో సొంతం

పాబ్లో పికాసో గీసిన సుమారు ₹9.3 కోట్ల (1 మిలియన్ యూరోలు) విలువైన ఒక అరుదైన పెయింటింగ్‌ను, పారిస్‌కు చెందిన ఒక వ్యక్తి కేవలం ₹11 వేల (100 యూరోలు) లాటరీ టికెట్‌తో సొంతం చేసుకున్నారు.


Published on: 16 Apr 2026 10:54  IST

పాబ్లో పికాసో గీసిన సుమారు ₹9.3 కోట్ల (1 మిలియన్ యూరోలు) విలువైన ఒక అరుదైన పెయింటింగ్‌ను, పారిస్‌కు చెందిన ఒక వ్యక్తి కేవలం ₹11 వేల (100 యూరోలు) లాటరీ టికెట్‌తో సొంతం చేసుకున్నారు.

'హెడ్ ఆఫ్ ఏ వుమన్' (Head of a Woman). దీనిని పికాసో 1941లో తన భాగస్వామి డోరా మార్ స్ఫూర్తితో గీశారు.అరీ హోదారా (58), పారిస్‌కు చెందిన ఒక సేల్స్ ఇంజినీర్.కేవలం 100 యూరోలు (సుమారు ₹11,000).ఈ పెయింటింగ్ అసలు మార్కెట్ విలువ సుమారు 1.45 మిలియన్ యూరోలు (దాదాపు ₹13 కోట్లు), కానీ లాటరీ కోసం దీనిని ₹9.3 కోట్లుగా నిర్ణయించారు. 

అల్జీమర్స్ వ్యాధిపై పరిశోధనల కోసం నిధులు సేకరించడమే లక్ష్యంగా 'అల్జీమర్స్ రీసెర్చ్ ఫౌండేషన్' ఈ వినూత్న లాటరీని నిర్వహించింది.ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.20 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి, దీని ద్వారా సుమారు 12 మిలియన్ యూరోల నిధులు సమకూరాయి.పారిస్‌లోని ప్రముఖ క్రిస్టీస్ ఆక్షన్ హౌస్‌లో ఆన్‌లైన్ ద్వారా ఈ డ్రాను నిర్వహించారు. ఈ పెయింటింగ్ దక్కిన విషయం తెలుసుకున్న అరీ హోదారా, మొదట ఎవరో తనను ఆటపట్టిస్తున్నారని భావించినా, అది నిజమని తెలిసి అమితానందాన్ని వ్యక్తం చేశారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి