Breaking News

సుడాన్-ఈజిప్ట్ వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో శనివారం జరిగిన వైమానిక దాడిలో కనీసం 72 మంది బంగారు గని కార్మికులు మరణించారు.

సుడాన్-ఈజిప్ట్  సరిహద్దు ప్రాంతంలో శనివారం జరిగిన వైమానిక దాడిలో 72 మంది బంగారు గని కార్మికులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనపై సుడాన్ రాజధాని కార్టూమ్‌కు చెందిన 'ఎమర్జెన్సీ లాయర్స్' అనే మానవ హక్కుల సంస్థ అధికారిక నివేదికను విడుదల చేసింది.


Published on: 12 Oct 2026 11:16  IST

సుడాన్-ఈజిప్ట్  సరిహద్దు ప్రాంతంలో శనివారం జరిగిన వైమానిక దాడిలో 72 మంది బంగారు గని కార్మికులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనపై సుడాన్ రాజధాని కార్టూమ్‌కు చెందిన 'ఎమర్జెన్సీ లాయర్స్' అనే మానవ హక్కుల సంస్థ అధికారిక నివేదికను విడుదల చేసింది.

ఈజిప్ట్ వాయుసేనపై ఆరోపణలు: ఈ వైమానిక దాడిని ఈజిప్ట్ వైమానిక దళం (ఈజిప్షియన్ ఎయిర్ ఫోర్స్) చేపట్టిందని సుడాన్ మానవ హక్కుల సంఘం ఆరోపించింది. అయితే దీనిపై ఈజిప్ట్ ప్రభుత్వం గానీ, ఆర్మీ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

దాడి జరిగిన తీరు: శనివారం ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో జెట్ విమానాలు ఒక్కసారిగా వచ్చి గని కార్మికుల శిబిరాలపై ఐదుకు పైగా క్షిపణులను ప్రయోగించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కూలీలు ఉన్న గుడారాలు, తవ్వకాల గుంతలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

వివాదాస్పద ప్రాంతం: ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న 'హలాయెబ్ ట్రయాంగిల్' సమీపంలోని జబల్ అల్-ఉఖైదత్ అనే అనధికారిక బంగారు గని లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈ సరిహద్దు ప్రాంతాన్ని తమదేనని సుడాన్, ఈజిప్ట్ రెండు దేశాలూ వాదిస్తున్నాయి.

ఇదే ఏడాది రెండోసారి: ఈ ప్రాంతంలోని బంగారు గనులపై ఈ ఏడాది దాడి జరగడం ఇది రెండోసారి. గత జూన్ నెలలో కూడా ఈజిప్ట్ భద్రతా దళాలు జరిపిన ఇటువంటి దాడిలోనే 23 మంది కార్మికులు మరణించారు.

సుడాన్‌లో గత మూడున్నరేళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధం కారణంగా ఉపాధి కోల్పోయిన వేలాది మంది ప్రజలు, జీవనోపాధి కోసం సరిహద్దుల్లోని ప్రమాదకరమైన అనధికారిక బంగారు గనులలో తవ్వకాలకు మళ్లుతున్నారు. ఇక్కడ  బంగారాన్ని అక్రమంగా ఈజిప్ట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement