Breaking News

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి రాంచీలో ఓవర్ స్పీడ్ వెళ్లినందుకు ట్రాఫిక్ పోలీసులు రూ. 1,000 జరిమానా విధించారు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి రాంచీలో ఓవర్ స్పీడ్ వెళ్లినందుకు ట్రాఫిక్ పోలీసులు రూ. 1,000 జరిమానా విధించారు.


Published on: 05 Mar 2026 17:18  IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి రాంచీలో ఓవర్ స్పీడ్ వెళ్లినందుకు ట్రాఫిక్ పోలీసులు రూ. వెయ్యి  ఫైన్ విధించారు.రాంచీలోని కాన్కే రింగ్ రోడ్డుపై నిర్దేశించిన 60 కి.మీ. వేగ పరిమితి కంటే ఎక్కువగా, తొంభైఒకటి కి.మీ.స్పీడ్తోతో కారు నడిపినట్లు గుర్తించారు.

ఆటోమేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఈ ఉల్లంఘనను గుర్తించి, మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 183 కింద -చలాన్ జారీ చేశారు.

ఐపీఎల్ 2026 సన్నాహాల్లో భాగంగా ధోనీ తన నివాసం సమీపంలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.ఇటీవల జార్ఖండ్ హౌసింగ్ బోర్డు నుంచి కూడా ధోనీకి ఒక నోటీసు అందింది. హర్ము రోడ్డులోని తన పాత నివాసాన్ని నివాస అవసరాలకు బదులు వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై ఈ నోటీసు ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి