Breaking News

మోపిదేవి ఆలయంలో కొల్లు రవీంద్ర పూజలు

ఫిబ్రవరి 21, 2026 శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లాలోని మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

Published on: 21 Feb 2026 14:55  IST

ఫిబ్రవరి 21, 2026 శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లాలోని మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆయన ఆలయంలోని నాగపుట్ట వద్ద పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్శనం అనంతరం మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి