Breaking News

జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం

విశాఖపట్నం జాతీయ రహదారిపై జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదంలో 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘోర ప్రమాదం జూన్ 18, 2026 గురువారం రాత్రి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలోని రేగుపాలెం జంక్షన్ వద్ద చోటుచేసుకుంది.

Published on: 19 Jun 2026 15:58  IST

విశాఖపట్నం జాతీయ రహదారిపై జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదంలో 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘోర ప్రమాదం జూన్ 18, 2026 గురువారం రాత్రి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలోని రేగుపాలెం జంక్షన్ వద్ద చోటుచేసుకుంది.

ఒడిశాలోని భువనేశ్వర్ నుండి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు నడుస్తుండగా ఇంజిన్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. బస్సులో మంటలు వ్యాపించడాన్ని గమనించిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై కిందకు దిగిపోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.ప్రయాణికులు దిగిన కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించి, వాహనం పూర్తిగా కాలి బూడిదైంది.అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. జాతీయ రహదారిపై బస్సు తగలబడటంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement