Breaking News

రౌతులపూడి ఆసుపత్రిలో 11 మంది చేరిక

కాకినాడ జిల్లా రౌతులపూడి సామాజిక ఆసుపత్రిలో (CHC) సోమవారం (30 మార్చి 2026) మధ్యాహ్నం జ్వరం మరియు కడుపునొప్పి లక్షణాలతో 11 మంది అస్వస్థతకు గురై చేరారు. 


Published on: 30 Mar 2026 17:40  IST

కాకినాడ జిల్లా రౌతులపూడి సామాజిక ఆసుపత్రిలో (CHC)  సోమవారం (30 మార్చి 2026) మధ్యాహ్నం జ్వరం మరియు కడుపునొప్పి లక్షణాలతో 11 మంది అస్వస్థతకు గురై చేరారు

వీరంతా కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా భావిస్తున్నారు.వీరంతా మండలంలోని ఉప్పంపాలెం గ్రామ శివారులోని ఒక క్రషర్‌లో పనిచేస్తున్న కార్మికులు. వీరు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులుగా గుర్తించబడ్డారు.చికిత్స పొందుతున్న 11 మంది బాధితుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి ఉమామహేశ్వర రెడ్డి వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి