Breaking News

అమరావతిలో గొంతు నూలిమి భార్యహత్య

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెను గొంతు నులిమి హత్య చేసి, ఆపై పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమరావతి ప్రాంతానికి సమీపంలోని మచిలీపట్నంలో చోటుచేసుకుంది.


Published on: 21 Oct 2026 17:18  IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెను గొంతు నులిమి హత్య చేసి, ఆపై పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమరావతి ప్రాంతానికి సమీపంలోని మచిలీపట్నంలో చోటుచేసుకుంది.

మృతురాలిని అడ్డాల విజయ రామ దుర్గాదేవి (31) గా, నిందితుడైన భర్తను మండలి శ్రీరామ్ (33) గా పోలీసులు గుర్తించారు. శ్రీరామ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, విజయ ఒక ప్రైవేట్ షాపులో టైపిస్ట్‌గా పనిచేసేవారు.వీరిద్దరికీ 2024 డిసెంబర్‌లో వివాహం జరిగింది. అయితే, కొద్దిరోజులుగా భార్య వేరే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతోందనే అనుమానం శ్రీరామ్‌లో బలపడింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి.

హత్య జరిగిన తీరు: మంగళవారం తెల్లవారుజామున నివాసంలో దంపతుల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి లోనైన శ్రీరామ్, విజయ గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు.

పోలీసులకు లొంగిపోయిన భర్త

భార్యను చంపిన అనంతరం నిందితుడు శ్రీరామ్ నేరుగా మచిలీపట్నంలోని ఆర్‌. పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

పోలీసుల చర్యలు

సమాచారం అందుకున్న వెంటనే ఆర్‌. పేట సీఐ ఏసుబాబు, ఎస్సై చాణక్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విజయ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Follow us on , &

ఇవీ చదవండి