Breaking News

బొగ్గులైన్ బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం

నంద్యాల పట్టణంలోని బొగ్గులైన్ నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా అండగా ఉంటుందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ స్పష్టం చేశారు.


Published on: 21 May 2026 18:54  IST

నంద్యాల పట్టణంలోని బొగ్గులైన్ నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా అండగా ఉంటుందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ స్పష్టం చేశారు. 2026 మే 21, గురువారం నాడు ఆయన నంద్యాలలో బొగ్గులైన్ బాధితుల కొరకు చేపడుతున్న స్థల సేకరణ ప్రక్రియను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు కేవలం ఒకే ఒక్క సెంటు స్థలం ఇచ్చి చేతులు దులుపుకుందని మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదలు ఆత్మగౌరవంతో, సౌకర్యవంతంగా జీవించాలనే ఉద్దేశంతో బాధితులకు రెండింతల స్థలాన్ని (2 సెంట్లు) కేటాయించాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.నంద్యాల పట్టణంలోని పలు అనువైన ప్రాంతాలను మంత్రి ఫరూక్ స్వయంగా పరిశీలించి, బాధితులకు అన్ని మౌలిక వసతులతో కూడిన మెరుగైన స్థలాన్ని త్వరగా కేటాయించాలని అధికారులను ఆదేశించారు.రోడ్డు విస్తరణ కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగతిన స్థల సేకరణ పూర్తి చేసి, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, స్థానిక కూటమి నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి