Breaking News

యాపిల్ పే అధికారికంగా నేడు భారతదేశంలో ప్రారంభమైంది

యాపిల్ పే అధికారికంగా నేడు భారతదేశంలో ప్రారంభమైంది. ఐఫోన్, ఐప్యాడ్, మరియు యాపిల్ వాచ్ వినియోగదారులు ఇప్పుడు ఈ సురక్షితమైన కాంటాక్ట్‌లెస్ చెల్లింపు సేవను ఉపయోగించుకోవచ్చు.


Published on: 30 Sep 2026 11:16  IST

యాపిల్ పే అధికారికంగా నేడు భారతదేశంలో ప్రారంభమైంది. ఐఫోన్, ఐప్యాడ్, మరియు యాపిల్ వాచ్ వినియోగదారులు ఇప్పుడు ఈ సురక్షితమైన కాంటాక్ట్‌లెస్ చెల్లింపు సేవను ఉపయోగించుకోవచ్చు.

మొదటి భాగస్వామి బ్యాంక్: ప్రస్తుతానికి ఈ సేవ కేవలం యాక్సిస్ బ్యాంక్ జారీ చేసిన వీసా మరియు మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.

యూపీఐ , రూపే సపోర్ట్ లేదు: ప్రస్తుతం యాపిల్ పే కేవలం కార్డ్ ఆధారిత చెల్లింపుల కోసం మాత్రమే పనిచేస్తుంది. ఇందులో ప్రస్తుతానికి UPI లేదా రూపే కార్డ్‌ల సపోర్ట్ లేదు.

పిన్ లేదా ఓటీపీ అవసరం లేదు: స్టోర్లలో పేమెంట్ చేసేటప్పుడు ఎటువంటి యాప్ ఓపెన్ చేయకుండా, పిన్ లేదా ఓటీపీలు ఎంటర్ చేయకుండా కేవలం డివైజ్‌ను ట్యాప్ చేయడం ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు.

ఎక్కడ ఉపయోగించవచ్చు: NFC సపోర్ట్ చేసే అన్ని పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టెర్మినల్స్‌తో పాటు, Apple Store, Blinkit, Zomato, మరియు Croma వంటి యాప్స్ ,వెబ్‌సైట్లలో కూడా దీనిని ఉపయోగించవచ్చు.

మీ ఐఫోన్‌లో యాపిల్ వాలెట్ (Apple Wallet) యాప్‌ను ఓపెన్ చేయండి.

మీ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వివరాలను జోడించి వెరిఫై చేసుకోండి.

పేమెంట్ చేసే సమయంలో ఐఫోన్ లేదా యాపిల్ వాచ్ సైడ్ బటన్‌ను డబుల్ క్లిక్ చేసి, Face ID లేదా Touch ID ద్వారా అథెంటికేట్ చేసి ట్యాప్ చేయవచ్చు

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement