Breaking News

పాకిస్థాన్ సైనిక కాన్వాయ్‌పై బలూచిస్థాన్ తిరుగుబాటు గ్రూపునకు చెందిన మహిళా సాయుధ దళం జరిపిన మెరుపు దాడుల్లో 9 మంది పాక్ సైనికులు మరణించారు

పాకిస్థాన్ సైనిక కాన్వాయ్‌పై బలూచిస్థాన్ తిరుగుబాటు గ్రూపునకు చెందిన మహిళా సాయుధ దళం జరిపిన మెరుపు దాడుల్లో 9 మంది పాక్ సైనికులు మరణించారు. బలూచిస్థాన్ విముక్తి కోసం పోరాడుతున్న 'బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్' (BLF) ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది.


Published on: 30 Sep 2026 13:58  IST

పాకిస్థాన్ సైనిక కాన్వాయ్‌పై బలూచిస్థాన్ తిరుగుబాటు గ్రూపునకు చెందిన మహిళా సాయుధ దళం జరిపిన మెరుపు దాడుల్లో 9 మంది పాక్ సైనికులు మరణించారు. బలూచిస్థాన్ విముక్తి కోసం పోరాడుతున్న 'బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్' (BLF) ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది.

కరీమా ఆర్మ్‌డ్ అసాల్ట్ డివిజన్

బలూచ్ స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త కరీమా బలూచ్ గుర్తుగా BLF ఇటీవల 'కరీమా ఆర్మ్‌డ్ అసాల్ట్ డివిజన్' పేరిట సరికొత్త మహిళా పోరాట విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మహిళా కమాండోల దళం చేపట్టిన మొట్టమొదటి భారీ ఆపరేషన్ ఇదేనని ఆ సంస్థ వెల్లడించింది. దాడులకు సంబంధించిన వీడియోలను కూడా వారు సోషల్ మీడియాలో విడుదల చేశారు.

మహిళా రెబెల్స్ రెండు వేర్వేరు ప్రాంతాలలో వ్యూహాత్మకంగా ఈ దాడులకు పాల్పడ్డారు:

టర్బాట్  సమీపంలో దాడి: చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) హైవేపై వెళ్తున్న పాక్ సైన్యానికి చెందిన 'క్విక్ రెస్పాన్స్ ఫోర్స్' (QRF) కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని మహిళా ఫైటర్లు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు సైనికులు అక్కడికక్కడే హతమయ్యారు.

కలాత్  జిల్లాలో దాడి: మంగుచర్ ప్రాంతంలో జరిగిన మరో ఆపరేషన్‌లో ముగ్గురు పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టినట్లు BLF ప్రకటించింది.

బలూచిస్థాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, బలవంతపు అదృశ్యాలకు వ్యతిరేకంగా తాము పాక్ బలగాలపై సాయుధ పోరాటం వేగవంతం చేశామని, ఇందులో మహిళల పాత్ర మరింత పెరిగిందని ఈ దాడుల ద్వారా స్పష్టమవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement