Breaking News

అధిక ఫీజులు, కొత్త వేతన పరిమితుల ప్రతిపాదనల వల్ల 2026 అక్టోబర్ నాటికి హెచ్-1బీ దరఖాస్తుల సంఖ్య భారీగా పపోడియింది.

అమెరికాలో హెచ్-1బీ వీసా (H-1B Visa) నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినతరం చేయడంతో, భారతీయ ఐటీ దిగ్గజాలు మరియు టెక్ నిపుణులు అమెరికా వీసాలకు క్రమంగా దూరమవుతున్నారు. అధిక ఫీజులు, కొత్త వేతన పరిమితుల ప్రతిపాదనల వల్ల 2026 అక్టోబర్ నాటికి హెచ్-1బీ దరఖాస్తుల సంఖ్య భారీగా పపోడియింది.


Published on: 21 Oct 2026 12:55  IST

అమెరికాలో హెచ్-1బీ వీసా (H-1B Visa) నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినతరం చేయడంతో, భారతీయ ఐటీ దిగ్గజాలు మరియు టెక్ నిపుణులు అమెరికా వీసాలకు క్రమంగా దూరమవుతున్నారు. అధిక ఫీజులు, కొత్త వేతన పరిమితుల ప్రతిపాదనల వల్ల 2026 అక్టోబర్ నాటికి హెచ్-1బీ దరఖాస్తుల సంఖ్య భారీగా పడిపోయింది.

ఐటీ కంపెనీల దరఖాస్తుల్లో భారీ కోత

కఠినమైన నిబంధనల కారణంగా భారతీయ ఐటీ దిగ్గజాలు హెచ్-1బీ రిజిస్ట్రేషన్లను రికార్డు స్థాయిలో తగ్గించాయి.

కాగ్నిజెంట్: గతంలో 3,752 దరఖాస్తులు చేయగా, ఈ ఏడాది ఏకంగా సున్నాకు (100% క్షీణత) తగ్గించింది.

టీసీఎస్: 5,955 రిజిస్ట్రేషన్ల నుండి కేవలం 284 దరఖాస్తులకు (95% క్షీణత) పరిమితమైంది.

ఇన్ఫోసిస్: గతంలో 8,886 దరఖాస్తులు చేయగా, ఈసారి వాటిని భారీగా తగ్గించుకుంది.

లక్ష డాలర్ల అదనపు ఫీజు భారం

అమెరికా వెలుపల (ఉదాహరణకు భారతదేశం) నుండి వచ్చే కొత్త హెచ్-1బీ దరఖాస్తుదారుల కోసం స్పాన్సర్ చేసే కంపెనీలు $100,000 (సుమారు ₹84 లక్షలు) అదనపు రుసుము చెల్లించాలనే నిబంధనను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ భారీ ఖర్చు భరించలేక కంపెనీలు భారత్ నుండి కొత్తవారిని తీసుకెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు.

$140,000 కనీస వేతన ప్రతిపాదన

అమెరికా చట్టసభల్లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు ప్రకారం, హెచ్-1బీ ఉద్యోగులకు కొన్ని మినహాయింపులు లభించాలంటే కనీస వేతనాన్ని $140,000 (సుమారు ₹1.18 కోట్లు) కు పెంచాలని ప్రతిపాదించారు. ఇది అమలులోకి వస్తే ఎంట్రీ-లెవెల్ టెక్కీలకు వీసాలు దక్కడం అసాధ్యంగా మారుతుంది.

గ్రేస్ పీరియడ్ రద్దు ఆలోచన , వర్క్ పర్మిట్ ఇబ్బందులు

అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వీసాదారులకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసే ప్రతిపాదనను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పరిశీలిస్తోంది. ఇది జరిగితే ఉద్యోగం పోయిన వెంటనే దేశం విడిచి రావాల్సి ఉంటుంది.

హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల (H4 వీసా) వర్క్ పర్మిట్ (EAD) ఆటోమేటిక్ పొడిగింపును కూడా రద్దు చేయడంతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.

రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్

 భారతదేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs) పెరుగుతుండటంతో 2026లో టెక్ నిపుణులు భారత్‌కు తిరిగి రావడం ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరింది.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement