Breaking News

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ , జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్లో వివిధ విభాగాలలో 899 ఖాళీల భర్తీ కోసం 2026 నోటిఫికేషన్

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ , జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (GREF) లో వివిధ విభాగాలలో 899 ఖాళీల భర్తీ కోసం BRO GREF Recruitment 2026 నోటిఫికేషన్ (Advt No. 01/2026) విడుదల చేసింది.


Published on: 29 May 2026 18:59  IST

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ , జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (GREF) లో వివిధ విభాగాలలో 899 ఖాళీల భర్తీ కోసం BRO GREF Recruitment 2026 నోటిఫికేషన్ (Advt No. 01/2026) విడుదల చేసింది.

పోస్టుల వివరాలు

మొత్తం 899 పోస్టులను కింది విధంగా కేటాయించారు:

స్టోర్ కీపర్ టెక్నికల్ (SKT): 300 పోస్టులు

ఆపరేటర్ కమ్యూనికేషన్: 261 పోస్టులు

ఆపరేటర్ ఎక్స్‌కవేటింగ్ మెషినరీ (OEM): 207 పోస్టులు

ఎలక్ట్రీషియన్: 79 పోస్టులు

డ్రాఫ్ట్స్‌మ్యాన్: 42 పోస్టులు

హిందీ టైపిస్ట్: 10 పోస్టులు

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 21 మే 2026

చివరి తేదీ: 04 జూలై 2026 (అస్సాం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల అభ్యర్థులకు 19 జూలై 2026 వరకు సమయం ఉంది).

అర్హతలు

కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.01 జూన్ 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు .పోస్టు బట్టి 10వ, 12వ తరగతి, ఐటిఐ  సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము

జనరల్ (UR), OBC, EWS మరియు మాజీ సైనికోద్యోగులకు: ₹50/-SC, ST మరియు వికలాంగులకు (PwBD): ఫీజు లేదు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement