Breaking News

వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికల సంఘం (EC) ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా 58 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను తొలగించింది

వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికల సంఘం (EC) ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా 58 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను తొలగించింది.


Published on: 15 Dec 2025 12:51  IST

వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికల సంఘం (EC) ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా 58 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను తొలగించింది. మరణాలు, శాశ్వతంగా తరలివెళ్లిన వారు, నకిలీ ఓట్లు వంటి కారణాలతో ఈ తొలగింపులు జరిగాయని ఈసీ తెలిపింది. 

మరణించినవారు (24 లక్షలకు పైగా), వేరే ప్రాంతాలకు తరలివెళ్లినవారు (సుమారు 20 లక్షలు), నకిలీ ఓటర్లు మరియు చిరునామా తెలియని వారుగా గుర్తించిన పేర్లను తొలగించారు.ఈ తొలగింపుల అనంతరం సవరించిన ముసాయిదా ఓటర్ల జాబితాను 2025 డిసెంబర్ 16న విడుదల చేయనున్నారు.ఈ భారీ స్థాయి ఓట్ల తొలగింపు ప్రక్రియ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ దుమారాన్ని రేపింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఇది ఓటర్లను తొలగించేందుకే ఉద్దేశించిన arbitrary (స్వచ్ఛంద) ప్రక్రియ అని ఆరోపించింది.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో 44,787 ఓట్లు తొలగించారు.ప్రతిపక్ష నేత సువేందు అధికారి నియోజకవర్గమైన నందిగ్రామ్‌లో 10,599 ఓట్లు తొలగించారు.దక్షిణ 24 పరగణాల జిల్లాలో అత్యధికంగా 8 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి. ఈ ఓటర్ల జాబితా సవరణపై ఫిర్యాదులు మరియు అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితాను 2026 ఫిబ్రవరి 14న ప్రచురించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 

 

Follow us on , &

ఇవీ చదవండి