Breaking News

ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్లగౌరారంలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలోఈరోజు (డిసెంబర్ 15, 2025) సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. 


Published on: 15 Dec 2025 18:19  IST

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్లగౌరారంలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలోఈరోజు (డిసెంబర్ 15, 2025) సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. 

పేలుడు సంభవించిన వెంటనే పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు.ఈ పేలుడుకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow us on , &

ఇవీ చదవండి