Breaking News

పెళ్లి కుదిరిన యువతిని వేధించి, ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమైన ఘోరమైన ఘటన

పెళ్లి కుదిరిన యువతిని వేధించి, ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమైన ఘోరమైన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో చోటుచేసుకుంది.


Published on: 23 Jun 2026 16:21  IST

పెళ్లి కుదిరిన యువతిని వేధించి, ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమైన ఘోరమైన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో చోటుచేసుకుంది.కర్ణాటక రాష్ట్రం, మైసూరు జిల్లా, తిరుమకూడలు నరసీపుర  తాలూకాలోని హళే కెంపయ్యనహుండి గ్రామం.21 ఏళ్ల యువతి రక్షిత, ఆమె తండ్రి శివణ్ణ (54), తల్లి నాగరత్న (44).అదే గ్రామానికి చెందిన ఉల్లాస్ గౌడ.

రక్షిత గతంలో ఉల్లాస్ గౌడతో స్నేహంగా ఉండేది. ఆ సమయంలో దిగిన ఫొటోలను అడ్డుపెట్టుకుని ఉల్లాస్ గౌడ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.రక్షితకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. జూన్ 24న వివాహం జరగాల్సి ఉంది. అయితే, తనే పెళ్లి చేసుకోవాలని, లేకపోతే కళ్యాణ మండపానికి వచ్చి గొడవ చేస్తానని నిందితుడు బెదిరించాడు. ఈ క్రమంలో రక్షితకు కాబోయే వరుడికి ఆమె ఫొటోలను పంపించి పెళ్లి చెడగొట్టడానికి కుట్ర పన్నాడు.ఈ విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి, అవమానభారానికి గురైన రక్షిత, ఆమె తల్లిదండ్రులు తమ ఇంట్లోనే విషం తాగి, ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఆత్మహత్యకు ముందు వారు రాసిన ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు ఉల్లాస్ గౌడ వేధింపులే కారణమని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన టి. నరసీపుర పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఉల్లాస్ గౌడను బెంగళూరులో మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పెళ్లి పనులతో సంబరంగా ఉండాల్సిన ఇంట్లో ఈ దుర్ఘటన జరగడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి