Breaking News

వివిధ ఎయిమ్స్ సంస్థలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న 1,484 గ్రూప్-బి, గ్రూప్-సి నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ (CRE-5) 2026 నోటిఫికేషన్‌ను విడుదల

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిమ్స్ సంస్థలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న 1,484 గ్రూప్-బి, గ్రూప్-సి నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ (CRE-5) 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.


Published on: 23 Jun 2026 18:58  IST

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిమ్స్ సంస్థలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న 1,484 గ్రూప్-బి, గ్రూప్-సి నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ (CRE-5) 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ముఖ్యమైన తేదీలు, అర్హతలు క్రింది విధంగా ఉన్నాయి:
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 13 జూన్, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: 03 జూలై, 2026 
అప్లికేషన్ స్టేటస్ / కరెక్షన్ విండో: 11 జూలై, 2026
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: 25 జూలై నుండి 27 జూలై, 2026 
పోస్టుల వివరాలు & విభాగాలు

అడ్మినిస్ట్రేటివ్ : జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్.
మెడికల్ : స్టాఫ్ నర్స్ ,ఫార్మసిస్ట్, లాబ్ టెక్నీషియన్, ఓటి అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, డెంటల్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, డైటీషియన్.
ఇంజనీరింగ్  విభాగాల్లో: జూనియర్ ఇంజనీర్ , ప్రోగ్రామర్, డ్రైవర్, జూనియర్ వార్డెన్, కాషియర్, అటెండెంట్.
అర్హతలు & వయోపరిమితి
అర్హత: పోస్టును అనుసరించి టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ , డిప్లొమా ఇన్ ఫార్మసీ, లేదా పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కొన్ని నిర్దిష్ట పోస్టులకు సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి: పోస్టును బట్టి కనీసం 18 ఏళ్ల నుండి గరిష్టంగా 35 లేదా 50 ఏళ్ల మధ్య ఉండాలి.
నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము
జనరల్ / OBC అభ్యర్థులకు: ₹3,000/-
SC / ST / EWS అభ్యర్థులకు: ₹2,400/-
దివ్యాంగులకు: ఫీజు నుండి పూర్తి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం
అభ్యర్థులను క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు: 
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్ 
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
వైద్య పరీక్షలు

Follow us on , &

ఇవీ చదవండి