Breaking News

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో మరోసారి ఓటమిని చవిచూశారు

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో మరోసారి ఓటమిని చవిచూశారు. మే 4, 2026న వెలువడిన ఫలితాల ప్రకారం ఆమెకు ఎదురైన పరాజయం వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Published on: 04 May 2026 19:03  IST

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో మరోసారి ఓటమిని చవిచూశారు. మే 4, 2026న వెలువడిన ఫలితాల ప్రకారం ఆమెకు ఎదురైన పరాజయం వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఆమె చెన్నైలోని మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో తమిళిసై మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఆమెకు సుమారు 32,328 ఓట్లు లభించాయి.

నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) అభ్యర్థి వెంకటరమణన్. పి ఈ స్థానంలో విజయం సాధించారు. ఆయనకు 70,070 ఓట్లు వచ్చాయి.డీఎంకే (DMK) అభ్యర్థి వేలు దా 41,098 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు.ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసైకి, ఇది వరుసగా ఏడవ ఎన్నికల ఓటమిగా వార్తల్లో నిలిచింది.

Follow us on , &

ఇవీ చదవండి