Breaking News

ఫిబ్రవరి 6 శుక్రవారం నాడు ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ కార్యకలాపాలు స్తంభించిపోయాయి

 ఫిబ్రవరి 6 (శుక్రవారం) నాడు ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఫిబ్రవరి 7 శనివారం సెలవు దినం కావడంతో, సభను నేరుగా ఫిబ్రవరి 9 (సోమవారం) ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

Published on: 07 Feb 2026 11:16  IST

 ఫిబ్రవరి 6 (శుక్రవారం) నాడు ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఫిబ్రవరి 7 శనివారం సెలవు దినం కావడంతో, సభను నేరుగా ఫిబ్రవరి 9 (సోమవారం) ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

భారత్-చైనా సరిహద్దు వివాదానికి సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే రాసిన పుస్తకంలోని అంశాలపై చర్చకు రాహుల్ గాంధీని అనుమతించకపోవడంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. దీనితో పాటు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కూడా గందరగోళం నెలకొంది.

ఈ బడ్జెట్ సమావేశాల్లో ఇప్పటివరకు సుమారు 19 గంటల 13 నిమిషాల విలువైన సమయం వృథా అయిందని స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు.

గందరగోళం మధ్యే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. అయితే, గత 22 ఏళ్లలో ప్రధాని ప్రసంగం లేకుండా ఈ తీర్మానం ఆమోదం పొందడం ఇదే తొలిసారి అని వార్తా సంస్థలు పేర్కొన్నాయి.ఫిబ్రవరి 9 నుంచి కేంద్ర బడ్జెట్‌పై చర్చ ప్రారంభం కానుంది. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement