Breaking News

జగన్‌కు కొత్త బిరుదిచ్చిన సోమిరెడ్డి.!


Published on: 13 Feb 2026 18:03  IST

ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డిని 'మర్చంట్ ఆఫ్ డెత్' అంటూ అభివర్ణించారు. జగన్ మోహన్ రెడ్డికి విధ్వంసం, రాజకీయాలంటే ఇష్టమని ఎద్దేవా చేశారు. డిక్కీలో శవాన్ని వేసుకుని వచ్చిన తన ఎమ్మెల్సీ భుజాన్నే తట్టి జగన్ అభినందిస్తారని దెప్పిపొడిచారు.తన ర్యాలీలోనే కార్యకర్తలు చనిపోతే కనీసం పరామర్శకు పోరని సోమిరెడ్డి విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి