Breaking News

బుల్లెట్‌ రైళ్ల హబ్‌గా శంషాబాద్‌!


Published on: 16 Feb 2026 11:47  IST

శంషాబాద్‌ ప్రాంతాన్ని హైస్పీడ్‌ రైళ్ల హబ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌ ముఖచిత్రాన్ని మరింత మార్చే హైస్పీడ్‌ (బుల్లెట్‌) రైళ్ల టెర్మినల్‌ను శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుకుని ఉన్న బహదూర్‌గూడ భూముల్లో ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన భూసేకరణపై కూడా దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్‌ రైల్వే కారిడార్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించింది. 

Follow us on , &

ఇవీ చదవండి