Breaking News

పరమేశ్వరుడి చెంత.. భక్తుల పులకింత


Published on: 16 Feb 2026 17:36  IST

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ ఆదివారం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజనంతో పులకించిపోయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర,ఛత్తీస్‌గఢ్,కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి లక్షన్నరకు పైగా మంది భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.భక్తులు ముందుగా రాజన్న ఆలయం వద్ద ప్రచార రథం,భీమేశ్వరస్వా మి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి