Breaking News

ఎన్నిక వాయిదా వేయడం దుర్మార్గం


Published on: 16 Feb 2026 18:20  IST

తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికను వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన విమర్శించారు..పరిస్థితులు సజావుగా ఉన్నప్పటికీ ఎన్నికను వాయిదా వేయడం దుర్మార్గమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి