Breaking News

తెలంగాణ రైతులకు బోనస్‌ నిధులు విడుదల


Published on: 16 Feb 2026 18:44  IST

తెలంగాణ రైతులకు ప్రబుత్వం తీపి కబురు చెప్పింది. వరి బోనస్‌ బకాయిలకు సంబంధించి నిధులను విడుదల చేసింది. వరి రైతులకు సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ కోసం రూ. 514.36 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బోనస్ పంపిణీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగు చేసిన 2.17లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఈ నిధుల విడుదలతోపాటు పౌరసరఫరాల సంస్థ వరి బోనస్‌ కోసం రూ.1,939.58 కోట్లు విడుదల చేయనుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement