Breaking News

ఎమ్మెల్యే ధూళిపాళ్ల తల్లి నివాసంలో భారీ చోరీ

గుంటూరు జిల్లా చింతలపూడిలోని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి నివాసంలో 2026, ఫిబ్రవరి 17న మంగళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. 


Published on: 17 Feb 2026 16:12  IST

గుంటూరు జిల్లా చింతలపూడిలోని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి నివాసంలో 2026, ఫిబ్రవరి 17న మంగళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. దొంగలు దాదాపు 43 నుంచి 50 సవర్ల బంగారం10 కిలోల వెండి వస్తువులు మరియు రూ. 1 లక్ష నగదును అపహరించారు.ఎమ్మెల్యే తల్లి ప్రస్తుతం గుంటూరులో తన కుమారుడి వద్ద ఉంటుండటంతో, చింతలపూడిలోని ఇల్లు ఖాళీగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు.

ప్రమీలాదేవి ఫిర్యాదు మేరకు పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్ పరిశీలించింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను విశ్లేషిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement