Breaking News

ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టులో చుక్కెదురు


Published on: 17 Feb 2026 15:39  IST

సినీ నటి ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి సుప్రీం కోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. నాలుగు వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. పోస్టుమార్టంను అన్ ప్రొఫెషనల్‌గా నిర్వహించారని ఉన్నతన్యాయస్థానం వ్యాఖ్యానించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు శిక్షను సమర్థించింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement