Breaking News

జాతీయ రహదారిపై కారు మంటల్లో దగ్ధం

ఫిబ్రవరి 18, 2026 బుధవారం ఉదయం  కామారెడ్డి జిల్లా సదాశివనగర్సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఒక కారు మంటల్లో దగ్ధమైంది. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు, పద్మాజివాడి గ్రామ సమీపంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

Published on: 18 Feb 2026 13:58  IST

ఫిబ్రవరి 18, 2026 బుధవారం ఉదయం  కామారెడ్డి జిల్లా సదాశివనగర్సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఒక కారు మంటల్లో దగ్ధమైంది. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు, పద్మాజివాడి గ్రామ సమీపంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

ఢీకొన్న వెంటనే కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, కారు పూర్తిగా దగ్ధమైంది.ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. స్థానిక ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి