Breaking News

బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ III సోదరుడు, మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్‌ను యూకే పోలీసులు  అరెస్ట్ చేశారు

బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ III సోదరుడు, మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్‌ను యూకే పోలీసులు 2026 ఫిబ్రవరి 19న అరెస్ట్ చేశారు.


Published on: 20 Feb 2026 12:09  IST

బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ III సోదరుడు, మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్బాటన్-విండ్సర్ను యూకే పోలీసులు 2026 ఫిబ్రవరి 19 అరెస్ట్ చేశారు.ప్రభుత్వ కార్యాలయంలో అధికార దుర్వినియోగానికి (Misconduct in Public Office) పాల్పడ్డారనే అనుమానంతో థేమ్స్ వ్యాలీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

లైంగిక నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు 2010లో కొన్ని రహస్య వాణిజ్య నివేదికలను ఆండ్రూ అందజేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దర్యాప్తు జరుగుతోంది.తూర్పు ఇంగ్లాండ్‌లోని సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లో తన 66వ పుట్టినరోజు నాడే ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం.సుమారు 12 గంటల విచారణ అనంతరం ఆండ్రూను పోలీసులు విడుదల చేశారు. అయితే ఈ కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఆయనపై ప్రస్తుతానికి ఎటువంటి అభియోగాలు నమోదు కాలేదని సమాచారం.

తన సోదరుడి అరెస్టుపై బ్రిటన్ రాజు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూనే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement