Breaking News

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన 10-15 నిమిషాల ఫాస్ట్ ఫుడ్ డెలివరీ యాప్ 'Snacc' (స్నాక్)ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) తన 10-15 నిమిషాల ఫాస్ట్ ఫుడ్ డెలివరీ యాప్ 'Snacc' (స్నాక్)ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.


Published on: 20 Feb 2026 17:56  IST

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) తన 10-15 నిమిషాల ఫాస్ట్ ఫుడ్ డెలివరీ యాప్ 'Snacc' (స్నాక్)ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 19, 2026 నాటి అంతర్గత సమాచారం ప్రకారం, ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. కేవలం 10-15 నిమిషాల్లో స్నాక్స్, పానీయాలు మరియు మినీ మీల్స్‌ను అందించాలనే లక్ష్యంతో జనవరి 2025లో బెంగళూరులో ఈ యాప్ ప్రారంభమైంది. సరిగ్గా ఏడాది కాలానికే ఈ సేవలకు ముగింపు పలికారు.

ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడం (Losses) మరియు వ్యాపారాన్ని విస్తరించడానికి అయ్యే ఖర్చులు (Scaling challenges) ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.

ఇది 'డార్క్ స్టోర్' (Dark Store) మోడల్‌పై పనిచేసేది. అంటే ఎంపిక చేసిన ప్రాంతాల్లో సొంత హబ్‌లను ఏర్పాటు చేసి ఆహారాన్ని నిల్వ ఉంచేవారు. బెంగళూరు, గురుగ్రామ్ మరియు నోయిడా వంటి నగరాల్లో ఇది పైలెట్ ప్రాజెక్ట్‌గా నడిచింది.Snacc విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను స్విగ్గీలోని ఇతర విభాగాల్లోకి తీసుకుంటామని (Absorb) సంస్థ తెలిపింది. 

Follow us on , &

ఇవీ చదవండి