Breaking News

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఫిబ్రవరి 26, 2026 గురువారం నాడు ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.


Published on: 26 Feb 2026 13:57  IST

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఫిబ్రవరి 26, 2026 గురువారం నాడు ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM) సంస్థకు సంబంధించి సుమారు రూ. 40,000 కోట్ల బ్యాంక్ లోన్ ఫ్రాడ్ మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ విచారణ జరిగింది. 

ఉదయం 10:30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికిచేరుకున్నారు.అంతకుముందు ఆగస్టు 2025లో ఒకసారి హాజరవగా, తాజా సమన్ల మేరకు ఇది రెండోసారి విచారణ.విచారణకు ఒకరోజు ముందే (ఫిబ్రవరి 25), ముంబైలోని పాలి హిల్‌లో ఉన్న ఆయన నివాసం 'అబోడ్' (Abode) ను ఈడీ అధికారులు జప్తు చేశారు. దీని విలువ సుమారు రూ. 3,716 కోట్లు.

ఈ కేసులో ఇప్పటివరకు అంబానీ గ్రూప్‌కు చెందిన సుమారు రూ. 15,700 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుల దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఈడీ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement