Breaking News

తెలుగు గంగ ప్రధాన కాలువకు భారీ గండి

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని నారాయణపురం గ్రామ శివారులో తెలుగు గంగ ప్రధాన కాలువకు గండి పడింది.నారాయణపురం శివారులోని తెలుగు గంగ ప్రధాన కాలువ 4 - 5 బ్లాకుల మధ్య ఈ భారీ గండి ఏర్పడింది.


Published on: 26 Feb 2026 15:47  IST

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరుమండలంలోని నారాయణపురం గ్రామ శివారులో తెలుగు గంగ ప్రధాన కాలువకు గండి పడింది.నారాయణపురం శివారులోని తెలుగు గంగ ప్రధాన కాలువ 4 - 5 బ్లాకుల మధ్య ఈ భారీ గండి ఏర్పడింది.

కాలువ గట్టు తెగడంతో పాటు సిమెంట్ లైనింగ్ కూడా కొట్టుకుపోయింది. దీనివల్ల భారీగా సాగునీరు వృథాగా సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ప్రవహిస్తోంది.సాగునీరు వృథా అవుతుండటంతో దిగువన ఉన్న పంటలకు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు తక్షణమే స్పందించి గండిని పూడ్చి, నీటి వృథాను అరికట్టాలని గ్రామస్థులు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి