Breaking News

తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత తలపతి విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత స్వర్ణలింగంచెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత తలపతి విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత స్వర్ణలింగంచెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


Published on: 28 Feb 2026 10:07  IST

తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత తలపతి విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత స్వర్ణలింగంచెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 27, 2026న ఈ వార్త అధికారికంగా వెలుగులోకి వచ్చింది. 

విజయ్‌కు ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం ఉందని, అలాగే మానసిక వేధింపులకు గురిచేశారని సంగీత తన పిటిషన్‌లో ఆరోపించారు. 2021 నుంచే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయని, గత రెండేళ్లుగా వారు విడిగా ఉంటున్నారని సమాచారం.

ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు, ఏప్రిల్ 20, 2026న విజయ్ వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.విజయ్, సంగీత 1999 ఆగస్టు 25న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు, కుమారుడు జాసన్ సంజయ్ మరియు కుమార్తె దివ్య సాష ఉన్నారు.

విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండగా, ఆయన భార్య సంగీత లండన్‌లో ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విడాకుల విషయంపై విజయ్ తరపు నుంచి ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో మరియు సినీ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. 

Follow us on , &

ఇవీ చదవండి