Breaking News

వికారాబాద్లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్ పట్టణంలో 2026, ఫిబ్రవరి 28 శనివారం రోజున దివ్య (28) అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.


Published on: 28 Feb 2026 11:36  IST

వికారాబాద్ పట్టణంలో 2026, ఫిబ్రవరి 28 శనివారం రోజున దివ్య (28) అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. వికారాబాద్ పట్టణంలోని టౌన్ గంగారం, సాయి బాబా కాలనీలోని తన నివాసంలో దివ్య ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.ఆమె కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ, ప్రస్తుతం ధారూర్ సీఐ కార్యాలయానికి అటాచ్‌మెంట్‌పై విధులు నిర్వహిస్తోంది.

ఆత్మహత్యకు ముందు దివ్య ఒక సూసైడ్ లెటర్ రాసినట్లు పోలీసులు గుర్తించారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు, ఎవరైనా వేధించారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి