Breaking News

వరంగల్‌లో  'స్వయంభు' చిత్ర బృందం సందడి

వరంగల్‌లో నిఖిల్ సిద్ధార్థ్హీరోగా నటిస్తున్న 'స్వయంభు' చిత్ర బృందం ఫిబ్రవరి 27, 2026న సందడి చేసింది. ఈ చిత్రం యొక్క ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ వరంగల్‌లోని కీలక ప్రాంతాలను సందర్శించింది. 


Published on: 28 Feb 2026 17:20  IST

వరంగల్‌లో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న 'స్వయంభు' చిత్ర బృందం ఫిబ్రవరి 27, 2026న సందడి చేసింది. ఈ చిత్రం యొక్క ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ వరంగల్‌లోని కీలక ప్రాంతాలను సందర్శించింది. 

ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు 'స్వయంభు' టీమ్ నిట్ వరంగల్లో జరిగిన 'స్ప్రింగ్ - 2026' వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలను పంచుకున్నారు.ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ కోటలోని స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయాన్ని చిత్ర బృందం దర్శించుకుంది. ఈ సినిమా కథాంశం కూడా చారిత్రక నేపథ్యంతో కూడుకున్నది కావడంతో ఇక్కడి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

భారీ బడ్జెట్‌తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్నభా నటేష్ నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి