Breaking News

బాలుడి కిడ్నలో 200 గ్రాములరాయి తొలిగింపు

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్ (RIMS)  అనుబంధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు మార్చి 3, 2026 న ఒక 12 ఏళ్ల బాలుడి మూత్రపిండం నుండి 200 గ్రాముల బరువున్న రాయిని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. 

Published on: 03 Mar 2026 10:41  IST

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్ (RIMS)  అనుబంధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు మార్చి 3, 2026 న ఒక 12 ఏళ్ల బాలుడి మూత్రపిండం నుండి 200 గ్రాముల బరువున్న రాయిని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. 

కొట్నక్ లింగు (12 ఏళ్లు), ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పాలవాగు గ్రామానికి చెందినవాడు.గత మూడేళ్లుగా కిడ్నీ నొప్పితో బాధపడుతున్నాడనీ, పరీక్షల్లో ఎడమ మూత్రపిండంలో భారీ రాయి ఉన్నట్లు గుర్తించారు.

యూరాలజీ నిపుణుడు డాక్టర్ కె. కార్తీక్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది.సుమారు 6 సెంటీమీటర్ల పొడవు, 200 గ్రాముల బరువు ఉంది. సాధారణంగా కిడ్నీలో రాళ్లు మిల్లీమీటర్ల (mm) పరిమాణంలో ఉంటాయి, కానీ ఇంత పెద్ద మొత్తంలో రాయి ఏర్పడటం అరుదుగా భావిస్తారు. 

Follow us on , &

ఇవీ చదవండి