Breaking News

మోదీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ 3 కోట్ల (30 మిలియన్ల) సబ్‌స్క్రైబర్ల మైలురాయిని అధిగమించింది. 

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో మరో సరికొత్త రికార్డు సృష్టించారు. మార్చి 3, 2026 నాటికి ఆయన అధికారిక యూట్యూబ్ (YouTube) ఛానెల్ 3 కోట్ల (30 మిలియన్ల) సబ్‌స్క్రైబర్ల మైలురాయిని అధిగమించింది.


Published on: 03 Mar 2026 16:58  IST

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో మరో సరికొత్త రికార్డు సృష్టించారు. మార్చి 3, 2026 నాటికి ఆయన అధికారిక యూట్యూబ్ (YouTube) ఛానెల్ 3 కోట్ల (30 మిలియన్ల) సబ్‌స్క్రైబర్ల మైలురాయిని అధిగమించింది. ఈ ఘనతతో ప్రపంచంలోనే అత్యధిక యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు కలిగిన దేశాధినేతగా మోదీ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు.

మోదీ తర్వాత రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కంటే ఆయనకు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ఇది ఏడు రెట్లు అధికం.

భారతీయ రాజకీయ నాయకుల్లో కూడా మోదీదే అగ్రస్థానం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కంటే ఆయనకు మూడు రెట్లు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.కేవలం వారం రోజుల క్రితమే (ఫిబ్రవరి 26, 2026) మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల (100 మిలియన్ల) ఫాలోవర్లను దాటిన మొదటి ప్రపంచ నాయకుడిగా చరిత్ర సృష్టించారు. 

Follow us on , &

ఇవీ చదవండి