Breaking News

ఆగి ఉన్న కంటైనర్ని ఢీకొన్న బస్సు

మార్చి 3, 2026, మంగళవారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.


Published on: 03 Mar 2026 19:00  IST

మార్చి 3, 2026, మంగళవారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ వద్ద  రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)కు చెందిన బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలు నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి