Breaking News

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అత్యవసర సుంకాలను కోర్టు కొట్టివేయడమే కాకుండా, వసూలు చేసిన మొత్తాన్ని కంపెనీలకు తిరిగి చెల్లించాలని సంచలన తీర్పు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అత్యవసర సుంకాలను (Emergency Tariffs) కోర్టు కొట్టివేయడమే కాకుండా, వసూలు చేసిన సుమారు $175 బిలియన్ల (దాదాపు ₹14.5 లక్షల కోట్లు) మొత్తాన్ని కంపెనీలకు తిరిగి చెల్లించాలని (Refund) సంచలన తీర్పు ఇచ్చింది. 

Published on: 05 Mar 2026 10:26  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అత్యవసర సుంకాలను (Emergency Tariffs) కోర్టు కొట్టివేయడమే కాకుండా, వసూలు చేసిన సుమారు $175 బిలియన్ల (దాదాపు ₹14.5 లక్షల కోట్లు) మొత్తాన్ని కంపెనీలకు తిరిగి చెల్లించాలని (Refund) సంచలన తీర్పు ఇచ్చింది. 

న్యూయార్క్‌లోని యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్ ఈ రీఫండ్ ప్రక్రియకు పచ్చజెండా ఊపారు.గత నెలలో (ఫిబ్రవరి 20, 2026) అమెరికా సుప్రీంకోర్టు ఈ సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది.దీని కొనసాగింపుగా, సుంకాలు చెల్లించిన ప్రతి కంపెనీకీ వడ్డీతో సహా రీఫండ్ పొందే హక్కు ఉందని తాజా కోర్టు ఉత్తర్వు పేర్కొంది.సుంకాల వసూళ్లను వెంటనే నిలిపివేయాలని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP)ని కోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ ప్రభుత్వం పాత సుంకాలను రద్దు చేస్తూనే, 'సెక్షన్ 122' కింద కొత్తగా 10% నుండి 15% వరకు గ్లోబల్ టారిఫ్‌లను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement