Breaking News

ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మరియు రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య అనుసంధానతను పెంచే రేడియల్ రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేలా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మరియు రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య అనుసంధానతను పెంచే రేడియల్ రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.


Published on: 05 Mar 2026 10:59  IST

హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేలా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మరియు రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య అనుసంధానతను పెంచే రేడియల్ రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

నగర శివారు ప్రాంతాలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 1,000 - 2,500 కోట్ల వ్యయంతో 22.3 కి.మీ పొడవైన రహదారి పనులను ఇటీవల ఖరారు చేశారు.

ఈ రేడియల్ రోడ్లు ORR నుంచి ప్రతిపాదిత RRR వరకు విస్తరించి ఉంటాయి. ఇది ఐటీ హబ్స్ఎలక్ట్రానిక్ సిటీయంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, మరియు భారత్ ఫ్యూచర్ సిటీ వంటి కీలక పారిశ్రామిక, విద్యా క్లస్టర్లకు నేరుగా అనుసంధానాన్ని కల్పిస్తాయి.

గండిపేట, మణికొండ, కోకాపేట వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు 6 లైన్ల రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ఎంజీఐటీ (MGIT) నుండి మణికొండ వరకు 3.57 కి.మీ మేర ఆధునిక సదుపాయాలతో కూడిన రహదారిని నిర్మిస్తున్నారు.హైదరాబాద్ చుట్టూ సుమారు 2,400 కిలోమీటర్ల మేర రహదారుల నెట్‌వర్క్‌ను రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా HMDA ఆధ్వర్యంలో పది కొత్త రేడియల్ రోడ్ల అమరికను సిద్ధం చేస్తున్నారు.

కొంగరకలాన్ నుండి ఫ్యూచర్ సిటీ మీదుగా ప్రాంతీయ రింగురోడ్డు వరకు 40 కిలోమీటర్ల మేర 330 అడుగుల విశాలమైన రహదారిని నిర్మించేందుకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు.ఈ అభివృద్ధి పనుల ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న శాటిలైట్ టౌన్‌షిప్‌లు మరియు పారిశ్రామిక కారిడార్లకు రవాణా వ్యవస్థ మరింత సులభతరం కానుంది. 

 

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement