Breaking News

భూదాన్ భూముల నిర్వాసితులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఖమ్మంలో  వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు మార్చి 10, 2026 మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. 


Published on: 10 Mar 2026 10:41  IST

ఖమ్మంలో  వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు మార్చి 10, 2026 మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. 

ఖమ్మం శివార్లలోని వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీలో ఇళ్లు కోల్పోయిన సుమారు 700 కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కవిత సోమవారం రాత్రి 9 గంటల నుంచి ఖమ్మం అంబేద్కర్‌ భవన్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో సుమారు 600 మంది పోలీసు బలగాలు అంబేద్కర్‌ భవన్‌కు చేరుకుని కవిత దీక్షను భగ్నం చేశాయి. మహిళా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని వాహనంలో అక్కడి నుంచి తరలించారు.తొలుత ఆమెను ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, శాంతిభద్రతల దృష్ట్యా తాజాగా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.కవితతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసినా తన నిరాహార దీక్షను కొనసాగిస్తానని, బాధితులకు అదే స్థలంలో ఇళ్లు నిర్మించి ఇచ్చే వరకు పోరాటం ఆపనని ఆమె ప్రకటించారు. ఈ అరెస్ట్ సమయంలో ఖమ్మంలోని జడ్పీ సెంటర్, అంబేద్కర్‌ భవన్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసుల వల్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి