Breaking News

ప్రేమ విఫలమై యువతి బలవన్మరణం

సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలం వట్టిపల్లి గ్రామంలో ఝాన్సీ (26) అనే యువతి ప్రేమ విఫలమై బలవన్మరణానికి పాల్పడిన ఘటన 2026, మార్చి 10న వెలుగులోకి వచ్చింది. 


Published on: 10 Mar 2026 18:06  IST

సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలం వట్టిపల్లి గ్రామంలో ఝాన్సీ (26) అనే యువతి ప్రేమ విఫలమై బలవన్మరణానికి పాల్పడిన ఘటన 2026, మార్చి 10 వెలుగులోకి వచ్చింది. 

తప్పట్ల ఝాన్సీ (26). ఈమె జగదేవపూర్‌ మండలం పలుగుగడ్డ ప్రాథమిక పాఠశాలలో విద్యా వాలంటర్‌గా పని చేస్తోంది.ప్రేమ విఫలమవడంతో మనస్తాపానికి గురై సోమవారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మృతురాలు డిగ్రీ పూర్తి చేసింది. ఆమెకు ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు.మర్కుక్‌ ఎస్సై దామోదర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి