Breaking News

కావలిలో  154 బస్తాల రేషన్ బియ్యం సీజ్

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జండా చెట్టు వీధిలో గల 10వ నంబర్ రేషన్ దుకాణం సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన 154 బస్తాల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Published on: 16 Mar 2026 16:39  IST

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జండా చెట్టు వీధిలో గల 10వ నంబర్ రేషన్ దుకాణం సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన 154 బస్తాల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన వాహన తనిఖీల్లో భాగంగా, రేషన్ డీలర్ గౌస్ భాషా నుంచి ఈ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిపై గత నాలుగు రోజులుగా అధికారులు నిఘా ఉంచినట్లు సమాచారం.

స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిత్యావసర వస్తువుల చట్టం (6A) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వార్త నివేదించింది.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement