Breaking News

ఏపీలో 14వేల మెట్రిక్టన్నుల LPG నిల్వలు

రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ (LPG) గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 17 మార్చి 2026న వెల్లడించారు.


Published on: 17 Mar 2026 18:59  IST

రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ (LPG) గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 17 మార్చి 2026న వెల్లడించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల (ఇరాన్ యుద్ధ ప్రభావం) నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

ప్రస్తుతం ఉన్న 14 వేల టన్నుల నిల్వలు రాష్ట్ర అవసరాలకు మరో 15 రోజులకు సరిపోతాయని, అదనపు గ్యాస్ కూడా త్వరలోనే రాబోతుందని సీఎం భరోసా ఇచ్చారు.ఆసుపత్రులు, హాస్టళ్లు, దేవాలయాలు వంటి అత్యవసర సేవలకు ఎక్కడా గ్యాస్ కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

సిలిండర్లు పక్కదారి పట్టకుండా, బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా -కేవైసీ (e-KYC) మరియు ఓటీపీ (OTP) విధానాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

గ్యాస్ వినియోగాన్ని తగ్గించేలా హోటల్ అసోసియేషన్లతో చర్చలు జరపాలని, ప్రజలు ఇండక్షన్ స్టవ్‌ల వాడకం పెంచుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.రాష్ట్రంలో పీఎన్జీ (PNG), సీఎన్జీ (CNG) వినియోగాన్ని పెంచాలని, కేజీ బేసిన్ గ్యాస్‌ను పైప్‌లైన్ల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే అంశంపై దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి