Breaking News

ఆటోను ఢీకొన్నకారు ప్రమాదంలో ఒకరు మృతి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో 20 మార్చి 2026 (శుక్రవారం) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.


Published on: 20 Mar 2026 16:21  IST

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో 20 మార్చి 2026 (శుక్రవారం) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మరిపెడ మండలం సీతారాం తండా స్టేజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఒక శుభకార్యానికి ఆటోలో తొమ్మిది మంది వెళ్తుండగా, ఎదురుగా అతివేగంగా వచ్చిన ఒక కారు ఆటోను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ఏడుగురికి కూడా గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి పంపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి