Breaking News

హైదరాబాద్ మెట్రో రైలును లార్సెన్ అండ్ టూబ్రో (L&T) సంస్థ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలును లార్సెన్ అండ్ టూబ్రో (L&T) సంస్థ నుండి పూర్తిగా తన ఆధీనంలోకి (టేకోవర్) తీసుకునే ప్రక్రియను మార్చి 31, 2026 నాటికి పూర్తి చేయనుంది. 


Published on: 24 Mar 2026 10:26  IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలును లార్సెన్ అండ్ టూబ్రో (L&T) సంస్థ నుండి పూర్తిగా తన ఆధీనంలోకి (టేకోవర్) తీసుకునే ప్రక్రియను మార్చి 31, 2026 నాటికి పూర్తి చేయనుంది. 

ప్రస్తుతం మెట్రో రైలు కార్యకలాపాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. యాజమాన్య బదిలీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.ఈ ప్రాజెక్టులో ఉన్న సుమారు ₹15,000 కోట్ల రుణాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

ప్రాజెక్టు స్వాధీనంతో పాటు ఎల్‌అండ్‌టీకి లీజుకు ఇచ్చిన 269 ఎకరాల భూమి, అలాగే 5 మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న మాల్స్ కూడా తిరిగి ప్రభుత్వ చేతికి రానున్నాయి.2026-27 బడ్జెట్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ₹1,100 కోట్లు కేటాయించింది. ఇందులో ₹600 కోట్లు ఫేజ్-2 కోసం, ₹500 కోట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)కు రుణాలుగా ఇవ్వనున్నారు.మెట్రో ప్రభుత్వం చేతికి రావడం వల్ల రెండో దశ విస్తరణకు ఉన్న సాంకేతిక ఆటంకాలు తొలగి, పనులు మరింత వేగవంతం కానున్నాయి. రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కి.మీ ఎక్స్‌ప్రెస్ కారిడార్ వంటి పనులు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి