Breaking News

సోషల్ మీడియాలో పుకార్లను నమ్మొద్దు నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.


Published on: 26 Mar 2026 18:07  IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి హామీ ఇచ్చారు.సోషల్ మీడియాలో గ్యాస్ కొరతపై వస్తున్న తప్పుడు వార్తల వల్ల ప్రజలు భయాందోళనతో ముందస్తుగా (Panic Booking) బుకింగ్‌లు చేస్తున్నారని, దీనివల్ల సిస్టమ్‌పై ఒత్తిడి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

మార్చి 26న విశాఖ పోర్టుకు ఒక భారీ ఎల్పీజీ ట్యాంకర్ చేరుకోనుందని, దీనివల్ల గ్యాస్ నిల్వలు మరింత పెరుగుతాయని వెల్లడించారు.గ్యాస్ సిలిండర్లను అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే 800 కేసులు నమోదు చేసి, 3,540 సిలిండర్లను సీజ్ చేసినట్లు మంత్రి తెలిపారు.పట్టణ ప్రాంతాల్లో ఎల్పీజీపై ఒత్తిడి తగ్గించేందుకు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ (PNG) వాడకాన్ని ప్రోత్సహిస్తామని, దీనిపై త్వరలోనే కొత్త పాలసీ తీసుకువస్తామని ప్రకటించారు. 

Follow us on , &

ఇవీ చదవండి