Breaking News

ఆదిలాబాద్లో యువకుడిని కర్రలతో కొట్టి చంపారు

ఆదిలాబాద్ పట్టణంలో శనివారం (మార్చి 28, 2026) తెల్లవారుజామున ఒక యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన అర్బాజ్ (25) అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు వెంబడించి కర్రలతో కొట్టి చంపారు.

Published on: 28 Mar 2026 15:11  IST

ఆదిలాబాద్ పట్టణంలో శనివారం (మార్చి 28, 2026) తెల్లవారుజామున ఒక యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన అర్బాజ్ (25) అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు వెంబడించి కర్రలతో కొట్టి చంపారు.

ఈ హత్య ఆదిలాబాద్ పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సునీల్ కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement