Breaking News

పంజాగుట్ట BMWకారులో అకస్మాత్తుగా మంటలు

హైదరాబాద్‌లోని పంజాగుట్ట మరియు బేగంపేట ప్రాంతాల మధ్య 2026 ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బేగంపేట నుండి పంజాగుట్ట వైపు వెళ్తున్న ఓ BMW కారులో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి.


Published on: 15 Apr 2026 12:40  IST

హైదరాబాద్‌లోని పంజాగుట్ట మరియు బేగంపేట ప్రాంతాల మధ్య 2026 ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బేగంపేట నుండి పంజాగుట్ట వైపు వెళ్తున్న ఓ BMW కారులో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. డ్రైవర్ అప్రమత్తమై కారును నిలిపివేసి వెంటనే కిందకు దిగడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది.ఈ ఘటన సుమారు ఉదయం 9:15 AM - 9:20 AM ప్రాంతంలో జరిగింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో పంజాగుట్ట మరియు గ్రీన్‌ల్యాండ్స్ వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

 

Follow us on , &

ఇవీ చదవండి