Breaking News

ప్రముఖ సబ్బుల తయారీ సంస్థ 'పవర్ సోప్స్' పై తమన్నా దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. 

మద్రాస్ హైకోర్టులో సినీ నటి తమన్నా భాటియాకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ సబ్బుల తయారీ సంస్థ 'పవర్ సోప్స్' (Power Soaps Limited) పై ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం 2026 ఏప్రిల్ 16న కొట్టివేసింది. 


Published on: 16 Apr 2026 19:14  IST

మద్రాస్ హైకోర్టులో సినీ నటి తమన్నా భాటియాకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ సబ్బుల తయారీ సంస్థ 'పవర్ సోప్స్' (Power Soaps Limited) పై ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం 2026 ఏప్రిల్ 16న కొట్టివేసింది. 

తమన్నా 2008 అక్టోబర్‌లో పవర్ సోప్స్ సంస్థతో బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్ గడువు 2009 అక్టోబర్‌తో ముగిసింది.ఒప్పంద గడువు ముగిసిన తర్వాత కూడా (ముఖ్యంగా 2010 నవంబర్ మరియు 2011 ఫిబ్రవరి మధ్య) ఆ సంస్థ తన ఫోటోలను సబ్బుల కవర్లపై, ప్రకటనల్లో అనధికారికంగా వాడుకుందని ఆమె ఆరోపించారు.తన ఫోటోలను అనుమతి లేకుండా వాడుకున్నందుకు గాను రూ. 1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. 

ఒప్పందం ముగిసిన తర్వాత కూడా సంస్థ తన చిత్రాలను వాడుకుందని నిరూపించే బలమైన ఆధారాలను తమన్నా సమర్పించలేకపోయారని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది.ఫోటోలు వాడటం వల్ల తన వ్యక్తిగత లేదా వృత్తిపరమైన గౌరవానికి ఎలాంటి నష్టం వాటిల్లిందో నిరూపించడంలో ఆమె విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.గతంలో ఒక సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, జస్టిస్ పి. వేల్ మురుగన్ మరియు జస్టిస్ కె. గోవిందరాజన్ తిలకవాడిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ అప్పీల్‌ను కొట్టివేసింది.

Follow us on , &

ఇవీ చదవండి